Latest News
తెలుగు జాతి, భాష, సంస్కృతి, సంప్రదాయాల పట్ల విశేషమైన అభిమానం, గౌరవం కలిగి, వాటి అభ్యున్నతి కోసం కృషి చేయడం లో భాగం గా రాజకీయాలకు, ప్రాంతాలకు అతీతం గా గత 5 సంవత్సరాలనుంచి ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం’ పేరుతో విశేషమైన కార్యక్రమం ఏర్పాటు చేస్తూవస్తున్నారు – భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ ఇంఛార్జి, ధర్మజ్ఞుడైన ప్రజానాయకుడు, మన తెలుగు వాడైన శ్రీ పి. మురళీధర రావు..! కాగా మూడు నెలల పాటు ‘గీతా ప్రచారం’ పేరుతో అమెరికా పర్యటన చేసి విజయవంతం గా ముగించుకుని ఇటీవలే తిరిగివచ్చిన ‘భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు’, గీతా గాన ప్రవచన ప్రచారకర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి ని శ్రీ మురళీధర రావు భగవద్గీతా ఫౌండేషన్ కార్యాలయం లో కలిసి అభినందనలు తెలియజేసారు. ఆయనకు శ్రీ గంగాధర శాస్త్రి ఆత్మీయ స్వగతం పలికారు. అనంతరం ‘తెలుగు సంగమం-సంక్రాంతి సమ్మేళనం-2024’ కార్యక్రమం గురించిన అనేక విషయాలను చర్చించారు. మురళీధర రావు ఆంతరంగికులు శ్రీ కిరణ్ చంద్ర కల్లూరి కూడా ఈ సమావేశం లో పాల్గొన్నారు. శ్రీ మురళీధరరావు వంటి నిస్వార్థమైన వ్యక్తులు రాజకీయాలలో మరింత ఉన్నత స్థానాలను అలంకరించడం ద్వారా ప్రజలకు, తెలుగు భాషా సంస్కృతులకు పరిపూర్ణమైన న్యాయం జరుగుతుందని గంగాధర శాస్త్రి ఆకాంక్షించారు.
హిందూ జనశక్తి అధినేత శ్రీ లలిత్ కుమార్, ‘శివశక్తి’ ప్రధాన కార్యదర్శి శ్రీ కల్యాణ్ కుమార్ చెట్లపల్లి, క్షత్రియ రైట్స్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్రీ శివాజీ రాజు, ‘హిందూ జన శక్తి’ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ లు హైదరాబాద్ లోని భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన ప్రవచన ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి ని కలిసి త్వరలో విశాఖపట్టణం లో తమ హిందూ ధార్మిక పరిషత్ నిర్వహించబోయే రౌండ్ టేబుల్ సమావేశానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. అనంతరం – అమెరికా లో లాస్ఏంజిలస్’ లో నివసిస్తూ ‘సిలికానాంధ్ర ‘మనబడి’ ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వ్యాప్తికై కృషి చేస్తున్న శ్రీ చంద్రశేఖర్ వెంపటి శ్రీ గంగాధర శాస్త్రి ని కలిసి ఆశీస్సులందుకున్నారు.
శాక్రమెంటో (అమెరికా)నగరం లో ఉంటూ దశాబ్దాలుగా తెలుగు, కన్నడ భాషా సాంస్కృతిక రంగాలకు సేవలందిస్తూ ‘కళా భీష్ముడు’ గా పేరుతెచ్చుకున్న శ్రీ ధన్వాడ ప్రభాకర రావు – హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ కార్యాలయాన్ని సందర్శించారు. భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డా II ఎల్ వి గంగాధర శాస్త్రి, ఫౌండేషన్ అడ్వొకసీ ఛీఫ్ శ్రీ ఆజాద్ బాబు తో కలసి శ్రీ ప్రభాకర రావు కు స్వాగతం పలికి సత్కరించారు. తమ శాక్రమెంటో నగరం లో శ్రీ గంగాధర శాస్త్రి చేసిన గీతా గాన ప్రవచనం తమను విశేషం గా ఆకట్టుకుందని, ఇలా గాన పద్దతి లో, నిత్యజీవితానికి అన్వయిస్తూ, స్ఫూర్తి దాయకం గా గీతను ప్రవచించడం ఆయనకే ప్రత్యేకమని భావించామని, అయన ప్రవచన ప్రభావం తో అనేక మందిలో భగవద్గీత అభ్యాసం పట్ల శ్రద్ధాసక్తులు పెరిగాయని,గీతా ప్రచారానికే తన జీవితాన్ని అంకితం చేసిన అటువంటి ఆధ్యాత్మిక వేత్త కి ఆతిధ్యం ఇచ్చే అవకాశం తమకే లభించినందుకు భాగ్యం గా భావిస్తామని ప్రభాకర రావు అన్నారు.
న్యూయార్క్, అమెరికా లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) పూర్వాధ్యక్షులు, భాషా సాంస్కృతిక రంగాల లో లబ్ధ ప్రతిష్టులు శ్రీ ఉదయ్ దొమ్మరాజు వర్ధమాన సినీ కథానాయకుడైన తన కుమారుడు చిII ఈశ్వర్ , తన కుమార్తె చిII దివ్య లతో హైదరాబాద్ లోని ‘భగవద్గీతా ఫౌండేషన్’ ను సందర్శించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకులు, గీతా గాన, ప్రవచన, ప్రచార కర్త డాII ఎల్ వి గంగాధర శాస్త్రి శ్రీ ఉదయ్ కి స్వాగతం పలికి సత్కరించారు. ఫౌండేషన్ లక్ష్యాలతో కూడిన లఘు చిత్రాన్ని వీక్షించిన అనంతరం ఫౌండేషన్ చేపట్టిన కార్యక్రమాలు, ప్రాజెక్టుల గురించి శ్రీ ఉదయ్ తెలుసుకుని గీతా ప్రచారం లో తానూ భాగస్వామినవుతానని అన్నారు. ఇటీవల లాంగ్ ఐలాండ్ లో జరిగిన గీతా గాన ప్రవచనానికి విశేషమైన స్పందన లభించిందని గుర్తు చేశారు.
‘పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం / ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే… పాపులను శిక్షించుట, పుణ్యాత్ములను రక్షించుట , ధర్మాన్ని స్థాపించుట… ఇది శ్రీ కృష్ణావతార పరమార్థం … ఆయన చెప్పిన ధర్మ మార్గం లోనే మనమూ నడవాలి. ధర్మంగా సంపాదించడం, ధర్మం గా సుఖపడడం లోనే మానసిక వత్తిడి లేని ఆనందం ఉంది. సర్వ జనామోదయోగ్యo గా కర్మలను ఆచరించడమే ధర్మం. ధర్మాన్ని ఆచరించడమే ధర్మాన్ని రక్షించడం అవుతుంది. ధర్మానికి ఇతరులవల్ల దెబ్బతగలకుండా రక్షించుకోవడం కూడా ధర్మాన్ని కాపాడుకోవడం లో భాగమే.. దీన్ని మనం అర్ధం చేసుకోకపోవడం వల్లే మన కళ్ళ ముందే మన మతం లోకి చొరబడి మన మతం మార్చేస్తున్నారు. మతం తల్లి లాంటిది. మతం మారితే తల్లి ని మార్చినట్టే. ఇది అమానుషం…! మన సనాతన ధర్మం పట్ల మన పిల్లలకు అవగాహన ఏర్పరచడం మన బాధ్యత.. సనాతన ధర్మ సారాంశమే భగవద్గీత. ఇదొక్కటి చదివితే చాలు సర్వశాస్త్రాలూ చదివినట్టే. ” అన్నారు భగవద్గీతా గాన ప్రవచన ప్రచార కర్త, భగవద్గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకులు డాII ఎల్ వి గంగాధర శాస్త్రి. నార్త్ కరోలినా (అమెరికా) లోని ర్యాలీ లో శ్రీ గోపాల్, శ్రీమతి లావణ్య కేతముక్కల దంపతులు ఏర్పాటు చేసిన సత్సంగం కార్యక్రమం (20.9. 2023)లోను, ఆ మరు రోజు షార్లెట్ లో శ్రీ కృష్ణం రాజు, శ్రీమతి పూర్ణిమ (21.9.2023) లు ఏర్పాటు చేసిన సత్సంగం లోను శ్రీ గంగాధర శాస్త్రి గీతా గాన ప్రవచనం చేశారు. ఉత్తమ మానవ జీవన విధానాన్ని బోధించే సనాతన ధర్మం గురించి స్ఫూర్తి దాయకం గా వివరించారు. ప్రారంభం లో ‘భక్తి యోగం’ లోని శ్లోకాలను పఠించిన చిన్నారులకు అభినందన పూర్వక ఆశీస్సులందించారు.

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

FCRA Regn. No. 010220252,
Approval U/S 80G (5) (VI) of I.T Act,
PAN No. AAAAB5882A

About Bhagavadgita

  1. Home
  2. »
  3. About Bhagavadgita

Srimad Bhagavadgita

Bhagavadgita, the Song Celestial, is a dialogue in nectarine poetry in which Bhagavan (Lord) Sri Krishna, the universal teacher, imparted knowledge of the Self and various other philosophical doctrines to Arjuna 5000 yrs. ago. Kurukshetra battlefield is the setting and Bharat (India) is the platform for the universal message of this Divine discourse of eternal relevance handed down for the well-being of humanity cutting across nations, creeds and ages

This Bhagavadgita, the summarized essence of the Upanishads, is a thriving philosophical treatise in 700 verses systematically divided into 18 chapters each one expounding one specific philosophical doctrine described as a YOGA. It is an integral part of the great epic Mahabharatha and is embedded in chapters 25-42 of Bhishmaparva as a compact, independent text and it is that way it became extremely popular and venerable.

In our relentless struggle for existence even in critical and challenging situations the Bhagavadgita extends comfort and courage. It indicates the right path and makes us tread on it. The enormous influence it exercises on a human being transformed it into a great moral and ethical force. To tell us to do our allotted duty without fear or favour and with purity of mind, speech and body and dedicate the fruits thereof to God is its message of imperishable significance.

All human beings without any distinction of age, gender and creed can read Bhagavadgita and live it to attain fulfillment in life. Bhagavadgita is not a religion – it is wisdom ! Bhagavadgita laid the path that leads us to an ideal way of life ! Bhagavadgita is the manual for attaining human excellence ! To those who practice ethical and spiritual disciplines it is the Kalpataru, the divine tree that fulfills the wishes !

Bhagavadgita is not a religious script – it is wisdom!

Bhagavadgita laid the path that leads us to an ideal way of life!

Bhagavadgita is the manual for attaining human excellence!

To those who practice ethical and spiritual disciplines it is the Kalpataru,

the divine tree that fulfills the wishes!

శ్రీమద్భగవద్గీత...

భారతదేశం వేదికగా, 5000 సంవత్సరాల క్రితం సర్వదేశాలకు, సర్వ జాతులకు, సర్వ కాలాలకు వర్తించే విధంగాసమస్త మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో, జగద్గురువైన శ్రీకృష్టుడు అర్జునునకు చేసిన జ్ఞానబోధ భగవద్గీత.సర్వోపనిషత్తుల సారమైన ఈ భగవద్గీత 18 అధ్యాయాల రూపంలో 700 శ్లోకాలుగా విలసిల్లుతోంది. ఇది ప్రసిద్ధ భారతీయ ఇతిహాసమైన’మహాభారతము’లోని ’భీష్మపర్వము’లో 25-42 అధ్యాయాల మధ్య గ్రథితమై ఉంది. జీవన సమరంలో సంక్లిష్ట సమయాలలో కూడా మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ, ధర్మబద్ధమైన మార్గాన్ని నిర్ధేశిస్తూ, కర్తవ్యాన్ని ఆచరింపచేసే మహాశక్తి భగవద్గీత. కర్తవ్యకర్మలను త్రికరణ శుద్ధిగా, ఫలితమును పరమాత్మకు అర్పించి, ఉద్విగ్నరహితుడై ఆచరింపమని చెప్పడమే ’భగవద్గీత’ సారాంశము. ’భగవద్గీత’ను సర్వకాల సర్వావస్థలలోను వయో, లింగ, వర్గ విభేధాలు లేకుండా మానవులందరూ పఠించి, ఆచరించి తరించవచ్చు.
  • భగవద్గీత’ మతం కాదు – జ్ఞానం !
  • ’భగవద్గీత’ ఉత్తమ జీవన విధాన మార్గము ! ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథము !
  • ’భగవద్గీత’ మానవులకు ఆశాదీపము ! సాధకులకు కల్పవృక్షము !