Srimad Bhagavadgita

Bhagavadgita, the Song Celestial, is a dialogue in nectarine poetry in which Bhagavan (Lord) Sri Krishna, the universal teacher, imparted knowledge of the Self and various other philosophical doctrines to Arjuna 5000 yrs. ago. Kurukshetra battlefield is the setting and Bharat (India) is the platform for the universal message of this Divine discourse of eternal relevance handed down for the well-being of humanity cutting across nations, creeds and ages.

This Bhagavadgita, the summarized essence of the Upanishads, is a thriving philosophical treatise in 700 verses systematically divided into 18 chapters each one expounding one specific philosophical doctrine described as a YOGA. It is an integral part of the great epic Mahabharatha and is embedded in chapters 25-42 of Bhishmaparva as a compact, independent text and it is that way it became extremely popular and venerable.

In our relentless struggle for existence even in critical and challenging situations the Bhagavadgita extends comfort and courage. It indicates the right path and makes us tread on it. The enormous influence it exercises on a human being transformed it into a great moral and ethical force. To tell us to do our allotted duty without fear or favour and with purity of mind, speech and body and dedicate the fruits thereof to God is its message of imperishable significance.

All human beings without any distinction of age, gender and creed can read Bhagavadgita and live it to attain fulfillment in life. Bhagavadgita is not a religion - it is wisdom ! Bhagavadgita laid the path that leads us to an ideal way of life ! Bhagavadgita is the manual for attaining human excellence ! To those who practice ethical and spiritual disciplines it is the Kalpataru, the divine tree that fulfills the wishes !


శ్రీమద్భగవద్గీత...

భారతదేశం వేదికగా, 5000 సంవత్సరాల క్రితం సర్వదేశాలకు, సర్వ జాతులకు, సర్వ కాలాలకు వర్తించే విధంగా సమస్త మానవాళి శ్రేయస్సును ఆకాంక్షిస్తూ కురుక్షేత్ర సంగ్రామంలో, జగద్గురువైన శ్రీకృష్టుడు అర్జునునకు చేసిన జ్ఞానబోధ భగవద్గీత. సర్వోపనిషత్తుల సారమైన ఈ భగవద్గీత 18 అధ్యాయాల రూపంలో 700 శ్లోకాలుగా విలసిల్లుతోంది. ఇది ప్రసిద్ధ భారతీయ ఇతిహాసమైన ’మహాభారతము’లోని ’భీష్మపర్వము’లో 25-42 అధ్యాయాల మధ్య గ్రథితమై ఉంది. జీవన సమరంలో సంక్లిష్ట సమయాలలో కూడా మనోధైర్యాన్ని ప్రసాదిస్తూ, ధర్మబద్ధమైన మార్గాన్ని నిర్ధేశిస్తూ, కర్తవ్యాన్ని ఆచరింపచేసే మహాశక్తి భగవద్గీత. కర్తవ్యకర్మలను త్రికరణ శుద్ధిగా, ఫలితమును పరమాత్మకు అర్పించి, ఉద్విగ్నరహితుడై ఆచరింపమని చెప్పడమే ’భగవద్గీత’ సారాంశము. ’భగవద్గీత’ను సర్వకాల సర్వావస్థలలోను వయో, లింగ, వర్గ విభేధాలు లేకుండా మానవులందరూ పఠించి, ఆచరించి తరించవచ్చు.

  • ’భగవద్గీత’ మతం కాదు - జ్ఞానం !
  • ’భగవద్గీత’ ఉత్తమ జీవన విధాన మార్గము ! ఉన్నత వ్యక్తిత్వ వికాస గ్రంథము !
  • ’భగవద్గీత’ మానవులకు ఆశాదీపము ! సాధకులకు కల్పవృక్షము !